నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (మే 12)

358
today programs

అమృతలత-అపురూప అవార్డ్స్‌
కార్యక్రమం: అమృతలత-అపురూప అవార్డ్స్‌ 2019 పురస్కార ప్రదానం.
జీవన సాఫల్య పురస్కారానికి నవలా రచన విభాగంలో జలంధర, సంగీతంలో ఎస్పీ శైలజ.
ఇతర విభాగాల్లో శీలా సుభద్రాదేవి, గోళ్ళమూడి సంధ్య, స్వాతి శ్రీపాద, శరత్‌ జ్యోత్స్నారాణి,
శిలా లోలిత, కిరణ్‌బాల, కన్నెగంటి అనసూయ, వనజా ఉదయ్‌, అయినంపూడి శ్రీలక్ష్మి, తాయమ్మ కరుణలకు అవార్డ్స్‌ ప్రదానం అతిథులు: కేవీ రమణాచారి, షావుకారు జానకి స్థలం: తెలుగు యూనివర్సిటీ సమయం: సా. 4.45

రైతు శిక్షణ
కార్యక్రమం: రైతు నేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ పంటల సాగు, వివిధ కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై రైతు శిక్షణ, అవగాహన
స్థలం: కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ ఆడిటోరియం, రెడ్‌ హిల్స్‌, లక్డీకాపూల్‌
సమయం: ఉ. 10 – 4

హరికథా ఉత్సవాలు
కార్యక్రమం: అమృతవర్షిణి, త్యాగరాయ గానసభ, కళాజ్యోతి ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి హరికథా ఉత్సవాలు
స్థలం: కళా వేంకట దీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6 – 9 (రేపటి వరకు)

నృత్య ఆరాధన
కార్యక్రమం: అభినేత్రి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వ ర్యంలో త్యాగరాజ సంగీత నృత్య ఆరాధన
స్థలం: శృంగేరీ శంకర మఠ్‌, నల్లకుంట
సమయం: ఉ. 9

సంగీత కచేరీ
కార్యక్రమం: దేవులపల్లి శిరీష ్క్ష బృందంచే కర్ణాటక సంగీత కచేరీ, భరతనాట్య ప్రదర్శన
స్థలం: శిల్పారామం
సమయం: సా. 5.30