మొబైల్స్ తయారీదారు కంపెనీ రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్‌టీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో దేశంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో ఇంతటి భారీ కెమెరాతో భారత్‌లో విడుదలైన మొదటి ఫోన్‌గా రియల్‌మి ఎక్స్‌టీ రికార్డులకెక్కింది. అంతే కాకుండా ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
పెరల్ వైట్, పెరల్ బ్లూ కలర్ ఆప్షన్లలో రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్ విడుదల కాగా.. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999 గా, 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి సైట్లలో ఈ నెల 16వ తేదీ నుంచి విక్రయించనున్నారు.