ప్రపంచంలోనే మొదటి మడతపెట్టే ల్యాప్ టాప్

359
lenovo foldable laptop

ఒకప్పుడు డెస్క్ టాప్‌లు వాడేవారు. ఇతర ప్రాంతాలకు మోసుకెళ్ళడం, అక్కడ పనిచేయడం చాలా శ్రమతో కూడుకున్నదిగా ఉండేది. తర్వాత ల్యాప్ టాప్, పాంట్యాప్ లు, నోట్ బుక్స్ వచ్చేశాయి. వీటితో పని చాలా సులువుగా అయిపోతోంది.

ప్రపంచంలోనే మడతపెట్టే ల్యాప్ ట్యాప్ చూశారా. అయితే ఇదిగో చూసెయ్యండి. లెనోవో కంపెనీ ఈమధ్యే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆసక్తికరంగా లెనోవో ఇప్పుడు ఫోల్డబుల్ స్క్రీన్ డివైస్ ను ఆవిష్కరించింది కానీ అది స్మార్ట్ ఫోన్ కాదు ల్యాప్ టాప్.ఇది ఫోల్డబుల్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. థింక్ ప్యాడ్ X1 పేరుతో ఉన్న ఈ డివైస్ కంపెనీ యొక్క వార్షిక అమ్మకాల కార్యక్రమంలో ప్రదర్శించారు.

లెనోవా థింక్ ప్యాడ్X1 ఫోల్డబుల్ చేయగల స్క్రీన్ లాప్ టాప్ యొక్క నమూనా ప్రత్యేకంగా రూపొందింది. సాంప్రదాయ ల్యాప్టాప్ ఆకారంలో ఉన్నా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనిని మనకు అనుకూలంగా మడిచి పనిచేసుకోవచ్చు. స్క్రీన్ పై కోణాలు ఉంటాయి. వాటి ఆధారంగా వీటిని మనం వంచవచ్చు. ఇది 13.3-inch హై-రిజల్యూషన్ డిస్ ప్లే కలిగి ఉంది.

ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ మైక్రో సాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని లెనోవో సంస్థ గత మూడు సంవత్సరాలుగా వివిధ పరీక్షల్లో ఉంచింది. 2020లో ఈ ఫోల్డబుల్ ల్యాప్ టాప్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది లెనోవో. దీనికి సంబంధించిన ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.