హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

723
Hyderabad Public School

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్, రామంతాపూర్)లో 1వ తరగతి ప్రవేశం కోసం షెడ్యూల్డ్ కులాల బాల బాలికల నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.ఆసక్తి ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ నెల 15వ తేదీ నుంచి మేడ్చల్ కలెక్టరేట్ బీ-బ్లాక్‌లోని ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఫారాలను ఉచితంగా తీసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు కార్యాలయంలో నేరుగా అందించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన తరువాత అర్హులైన అభ్యర్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని, 29న సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్న లాటరీ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన తెలిపారు.