విస్కీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

687
Health Benefits With Whiskey

మ‌ధ్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అంటారు. కానీ అది మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని చాలామందికి తెలీదు.

విస్కీ, వైన్ లాంటివి మ‌న శ‌రీరానికి మేలు చేస్తాయ‌ట‌. ముఖ్యంగా విస్కీ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌న్న విష‌యం మీకు తెలుసా?

విస్కీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

విస్కీ తాగితే బ‌రువు త‌గ్గుతార‌ట‌. ఈ విష‌యాన్ని అమెరిక‌న్ చాయిస్ ఆఫ్ క్లినిక‌ల్ న్యూట్రిష‌న్ అధ్య‌య‌నం ప్ర‌చురించింది.

మ‌ద్యం మితంగా తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ట‌. అతిగా తాగితేనే ప్ర‌మాదం.

మ‌ద్యాన్ని మితంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైన్‌ను రోజుకు ఒక‌టి లేదా రెండు గ్లాసులు తీసుకుంటే మంచిదేన‌ని వైద్యులే సూచిస్తారు.

అలాగే విస్కీ తాగ‌డం వ‌ల్ల కూడా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని అంటున్నారు. విదేశాల్లో చాలా మంది రాత్రి భోజ‌నం త‌ర్వాత విస్కీని తీసుకుంటార‌ట‌. ఇది జీర్ణ ప్ర‌క్రియ‌ను స‌రిచేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌.

అలాగే విస్కీని కొద్దిగా వేడి నీటీలో క‌లుపుకుని తాగితే ద‌గ్గు, మెడ నొప్పి వంటి వాటి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చంట‌.

మీకు ఇంకో విష‌యం చెప్ప‌నా.. విస్కీ మ‌న శ‌రీరానికి వేడిని ఇస్తుంద‌ట‌.

దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి కొత్త శ‌క్తిని ఇస్తుంద‌ట‌. దీని వ‌ల్ల స్వీట్స్ బాగా తినే అల‌వాటు ఉన్న వాళ్లు ఆ అల‌వాటును మానేస్తార‌ట‌. చ‌లికాలంలో కాలు కింద పెట్ట‌డానికి కూడా భ‌య‌ప‌డ‌తాం.

అయితే విస్కీ తాగితే చ‌లి నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చ‌ని ఆ అధ్య‌య‌నంలో పేర్కొన్నారు. విస్కీ తాగితే శ‌రీరం వేడెక్కి చ‌లి తీవ్ర‌త త‌గ్గుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి.

ఏదిఏమైనా మితంగా తీసుకుంటే ఏదైనా మ‌న శ‌రీరానికి మేలు చేస్తుంది. అంతేగాని శ‌రీరానికి మేలు చేస్తుంద‌ని చెప్పారు క‌దా అని బాటిళ్లు బాటిళ్లు తాగి..

గొడ ప‌ట్టుకుని న‌డిచేంత‌గా తాగితే చివ‌రికి నష్టపోయేది మ‌న కుటుంబ‌మే. ఆరోగ్యం పాడై బాధ ప‌డేది మ‌న‌మే.

కాబ‌ట్టి మితంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.