సాధారణంగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్లకు ముందు గుర్తొచ్చేది గ్రీన్ టీ. అయితే గ్రీన్ టీ తీసుకోడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. గ్రీన్ టీని ఎప్పుడు, ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
* రోజుకి రెండు నుండి ఐదు కప్పుల వరకూ మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి.
* భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే క్యాలరీలన్నీ త్వరగా కరిగిపోతాయని ఒక అపోహ ఉంది.
కానీ భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే ఫుడ్ లో ఉన్న ప్రొటీన్స్ ని బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు.
* గ్రీన్ టీ వేడిగా ఉన్నప్పుడు అందులో తేనె కలపకండి. గ్రీన్ టీ గోరు వెచ్చగా అయిన తరువాత తాగబోయేముందు మాత్రమే తేనె, దాల్చిన చెక్క వంటివి కలుపుకోవాలి.
* గ్రీన్ టీ ని వేడి వేడిగా ఎప్పుడూ తీసుకోకూడదు. అలా తీసుకుంటే గ్రీన్ టీ అసలు రుచిగా ఉండదు.
పైగా పొట్టకీ, గొంతు కీ మంచిది కాదు. గ్రీన్ టీ ఎప్పుడూ గోరు వెచ్చగానే తాగాలి.
* గ్రీన్ టీ ని పరగడుపున తాగరాదు. చాలా సేపు ఏమీ తినకుండా ఉన్న తరువాత గ్రీన్ టీ తాగితే స్టమక్ ఆసిడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి.
డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. గ్రీన్ టీ ని ఎప్పుడూ తినడానికీ తినడానికీ మధ్యలో తీసుకోవాలి.
* గ్రీన్ టీ ఆకులని ఎక్కువ సేపు వేడి నీటిలో ఉంచకూడదు. ఇందు వల్ల రుచి పోవడమే కాక, న్యూట్రియెంట్ లాస్ కూడా జరుగుతుంది. అది హానికరం కూడా.
* ఈ మధ్య గ్రీన్ టీ లో చాలా ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి.
ఇవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. వీలున్నంత వరకూ నాచురల్ ఫ్లేవర్డ్ గ్రీన్ టీ కే ప్రిఫరెన్స్ ఇవ్వండి.
* ఒక కప్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ మాత్రమే వేయాలి. ఎక్కువ గ్రీన్ టీ వల్ల ఎక్కువ కొవ్వు కరుగుతుందని కొంత మంది అనుకుంటారు.
గ్రీన్ టీ ఎక్కువైతే డైజెషన్ సమస్యలు వస్తాయి.
* గ్రీన్ టీ బ్యాగ్స్ ని మూత ఉన్న డబ్బాలోనే దాచి ఉంచడం మంచిది.
* గ్రీన్ టీ మంచిదే కాబట్టి ఎన్ని సార్లు తీసుకున్నా తప్పు లేదనే భావనతో ఉంటారు కొంత మంది.
మామూలు టీ, కాఫీ లాగానే గ్రీన్ టీ లో కూడా కెఫీన్ ఉంటుంది. అందుకే, రోజుకి రెండు మూడు కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోకూడదు.
* గ్రీన్ టీ తో మెడిసిన్స్ తీసుకోకూడదు. గ్రీన్ టీ లో ఉన్న ఆసిడ్స్ తో మెడిసిన్స్ లో ఉన్న కెమికల్స్ కలిస్తే ఒక్కోసారి హాని జరగవచ్చు.
మెడిసిన్స్ ని ఎప్పుడూ మామూలు నీటితో నే తీసుకోవాలి.