సాధారణంగా మలబద్ధకం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.
ఇది శారీరక ఆరోగ్యం మీద మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యని సహజంగానే పరిష్కరించుకోవచ్చు.
డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అయితే మలబద్దకం నుండి బయట పడాలి అంటే మీరు ఎక్కువగా హైడ్రేట్ గా ఉండాలి.
ఫైబర్ ను డైట్ లో ఎక్కువగా చేర్చుకోవడం మంచిది. ఫైబర్ కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, చిక్కుడు, బీన్స్, గింజలు వంటి వాటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది.
కొన్ని రకాల ఫ్రూట్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ గానే ఉంటుంది ఇది మలవిసర్జన సరిగా జరిగేలా చూసుకుంటుంది.
వ్యాయామం కోసం ప్రతిరోజూ కాస్త సమయం వెచ్చిస్తే మీ ఆరోగ్యం మరింత మెరుగు అవుతుంది. అలాగే వ్యాయామం చేయడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.
రెగ్యులర్ గా వాకింగ్ , స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్ లాంటివి చేస్తే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే కాఫీలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకం నుంచి బయట పడడానికి సహాయం చేస్తాయి. కేఫినేటెడ్ కాఫీ తీసుకోండి.
వెల్లుల్లి, అరటిపళ్ళు, ఉల్లిపాయలు వగైరా ఆహారం తీసుకోవడం వల్ల మలబద్దకం నుండి బయట పడవచ్చు. ఇది మీ డైజెస్టివ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
డైరీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. అయితే ఏది ఏమైనా ఒక లిమిట్ లో తీసుకుంటే మంచి జరుగుతుంది. అతిగా తింటే సమస్యలు తప్పవు .