తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు.
మోదీ చెప్పే అబద్ధాలను ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారన్నారు.
మోదీ అబద్ధాలు చెబుతున్నప్పుడు కిషన్ రెడ్డి నిజాలు ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
పార్టీ హైకమాండ్ అనుమతితోనే రాష్ట్రంలో తిరుగుతానని అన్నారు. తెలంగాణ మొత్తం పర్యటించి, కేసీఆర్ ని కమ్మేస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేసిన రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వకుండా రైతు చనిపోతే రైతు బీమా ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు.
కుప్పగండ్లతో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిరిజనులకు చెందిన 400 ఎకరాల భూములను తమవారి పేరు మీద బదిలీ చేయించుకున్నారని రేవంత్ ఆరోపించారు.