ఆపిల్ సైడర్ వెనిగర్ ని సైడర్ వెనిగర్ అని కూడా అంటారు. దీనిని ఆపిల్ తో లేదా సైడర్ తో తయారు చేస్తారు. ఆపిల్స్ ని ఫెర్మెంట్ చేసి ఒక పద్ధతి లో వెనిగర్ ని రూపొందించడం జరుగుతుంది.
పసుపు రంగు లో ఉండే ఈ వెనిగర్ ఆపిల్స్ ని తీసుకుని వాటి ద్వారా తయారు చేస్తారు. అందుకే ఈ ఫ్రూట్ ఫ్లేవర్ మనకి వస్తుంది. దీనిలో న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి.
సలాడ్లు చట్నీలు వంటి వాటిని తయారు చేసినప్పుడు దీన్ని ఉపయోగించ వచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:
షుగర్ లెవెల్స్ ను తగ్గించి హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
బ్లడ్ షుగర్ లెవల్స్ ని మేనేజ్ చేస్తుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
మెటబాలిజంను ఇంప్రూవ్ చేస్తుంది.
పీహెచ్ లెవెల్స్ ని హెల్తీగా ఉంచుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది.