కాఫీ అధికంగా తాగడం వల్ల ప్రమాదమే..!

276
Drinking too much coffee is dangerous ..!

ప్రతి రోజు కొందరు ఇష్టానుసారంగా కాఫీ త్రాగుతుంటారు. అలసటకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు కాఫీ ప్రియులు రోజుకు 10 కప్పులు కాఫీ తాగుతుంటారు.

ఇంలాంటి వారికి ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు హెచ్చరికలు చేశారు.కాఫీ ప్రియులు దాన్ని తాగే విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

కాఫీ అధికంగా తాగడం వల్ల హృద్రోగాలు వస్తాయని తేల్చారు.ప్ర‌తిరోజు ఐదు కప్పుల‌కు మించి కాఫీ తాగేవారు హృద్రోగాల నుంచి త‌ప్పించుకోలేర‌ని తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా ప‌రిశోధ‌కులు కాఫీ అధికంగా తాగడం వల్ల జరిగే పరిణామాలను తాజాగా వెల్ల‌డించారు.

ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో.. కాఫీలో ఉండే కఫెస్టోల్‌ రసాయన మూలకం కార‌ణంగా కొవ్వు పేరుకుపోతోంద‌ని వివ‌రించారు.

దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా‌ జరగకపోవ‌డంతో హృద్రోగాలు వ‌స్తున్నాయ‌ని అన్నారు.

ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుంని చెప్పారు. కాఫీ ప్రియులు ఫిల్టర్‌ కాఫీకి ప్రాధాన్య‌త ‌ఇస్తే బాగుంటుంద‌ని వెల్లడించారు.