సోషల్ మీడియాలోని అప్లికేషన్ల ద్వారా భారత ప్రజల సమాచారం ఇతర దేశాలకు వెళుతోంది. ఇటీవలే చైనా కుట్రలను మనం చూశాం. దీంతో భారత ప్రభుత్వం ఎవ్వరినీ నమ్మడం లేదు.
ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ భారత ప్రజల కోసం సందేశ్ అనే కొత్త యాస్‌ను వాట్సాప్‌కు ధీటుగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని అన్ని ప్రభుత్వ అధికారులు ఉపయోగిస్తున్నారు.
అంతేకాకుండా సంవాద్ అనే కొత్త అప్లికేషన్ కోసం ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాక పనులు ప్రారంభించింది. సందేశ్ యాప్‌లో వినియోగదారుల సమాచారం గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
దీన్ని వినియోగించేందుకు ప్రభుత్వాధికారులకు, ప్రజలకు అనుమతి ఇవ్వబడింది. దీంట్లో సైన్-అప్ కావాలంటే వినియోగదారుల ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పనిసరి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కొన్ని దశలు ఉంటాయి.
యాప్‌ను డౌన్‌లోడ్ చేయడమెలా?
ఈ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉందన్న విషయం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు తెలీదు. కానీ మీ ఆండ్రాయిడ్ ఫోన్ వెర్షన్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
ఐఓఎస్ పరికరాల కోసం మీకు ఐఓఎస్ 11 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు మొదట ఏపీకే ఫైల్‌ను జీఐఎమ్ఎస్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఎందుకంటే ఈ యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో అందుబాటులో లేదు. అంటే వినియోగదారులు ప్రభుత్వ పోర్టర్ ద్వారా మాత్రమే అప్లికేషన్‌ణు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ
మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వినియోగదారులు వారి మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీతో సైన్ ఆఫ్ కావాలి.
అప్పుడు వినియోగదారునికి ఆరు అంకెలు గల ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు తమ మెసేజ్‌లను ఇ-మెయిల్ ఐడీలో బ్యాకప్‌గా ఉంచుకునేందుకు అనుమతి లభిస్తుంది.
గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్‌లో నిక్షిప్త పరిచినట్టు ఇది పూర్తిగా కొత్తది.
మరికొన్ని ఫీచర్లు
సైన్ అప్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీని మార్చడానికి సందేశ్ అప్లికేషన్ అనుమతించదు. ఈ యాప్‌ను వినియోగించడానికి ఒకే ఫోన్ నెంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీని ఉపయోగించాల్సి ఉంటుంది.
మీ ఖాతాను తొలగించవచ్చు, వేరే మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ ద్వారా కొత్త ఖాతాను తెరవవచ్చు. అయితే మీ కాంటాక్ట్‌లను ఇది గుర్తిస్తుంది.
వారితో చాటింగ్‌కు అనుమతిస్తుంది. కానీ మీరు ఇన్విటేషన్ పంపలేరు.