చింతగింజల చూర్ణం… మోకాళ్ల నొప్పులు మాయం

658

మనం ప్రతిరోజు వంటకాల్లో చింత పండును ఉపయోగిస్తాం. దానిలోని గింజల్ని తీసి పారేస్తుంటాం. చింతపండు వల్ల మాత్రమే కాకుండా చింత గింజలతో కూడా మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ చిన్న టిప్స్ పాటిస్తే చింత గింజలతో ఆరోగ్యాన్ని పొందవచ్చు.

-పుచ్చులు లేని చింత గింజల్ని పెనంపై బాగా వేయించుకుని మంచి నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టాలి. ప్రతి రోజు రెండు పూటలా నీటిని మారుస్తూ ఉండాలి. ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసేసి మెత్తగా పొడిచేసి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేదా చక్కెర కలిపి తీసుకోవాలి.

-చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాకుండా డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలకు బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా చింతగింజల చూర్ణం తీసకుంటే నెలలోపే ఫలితం కనిపిస్తుంది.

-చింత గింజలు బాగా ఎండబెట్టి పొడిచేయాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా చింతకాయ విత్తనం పొడి కలిపి మౌత్ వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన పోతుంది. ఇందులో యాంటీ ఇన్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పిని, జలుబును తగ్గిస్తాయి.

-చింతగింజల జ్యూస్‌తో అజీర్ణం సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. చింతగింజల జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గింజల పైన ఉండే రెడ్ కలర్ కోట్‌లో జిలోగ్లూక్యాన్ ఉంటుంది. ఇది డయేరియాను నివారిస్తుంది.

-కొన్ని చింతగింజల్ని వేయించి పొడి చేసుకుని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని రోజూ రెండు పూటలు తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చింతగింజల్లో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇది గుండెను భద్రంగా ఉంచుతుంది.