లవంగాలు తింటే ఎన్నో ప్రయోజనాలు

673
health benefits

మనందరి ఇళ్లలో లవంగాలు లేని పోపుల డబ్బా ఉండదు. ఎందుకంటే లవంగాలు చేసే మేలు అలాంటిది. లవంగాలు చిన్నగా ఉన్నా… వ్యాధుల్ని తరిమికొట్టడంలో, విష పదార్థాల్ని శరీరంలోంచీ బయటకు పంపడంలో బాగా పనిచేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

జనరల్‌గా లవంగాల్ని వంటల్లో, నాన్ వెజ్ కూరల్లో, బిర్యానీ తయారీలో వేస్తారు. అలా చెయ్యడం వల్ల ఆ కూరకు టేస్ట్ పెరగడమే కాదు… మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పువ్వుల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.

లవంగాల్ని పొడిగా చేసి… దెబ్బతిన్న దంతం దగ్గరా, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే… మెల్లమెల్లగా అది మందులా పనిచేసి… నొప్పిని తగ్గించేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు.

శరీరంలోని వేడి ఎక్కువగా ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే అరికట్టాలంటే రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే తాజా స్వాస వచ్చి… నోటి దుర్వాసన పోతుంది.

ప్రయాణాలు పడని వారికి తిన్న ఆహారం జీర్ణం కాదు. వామ్టింగ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓ రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే చాలు. ఆహారం జీర్ణమూ అవుతుంది. వికారం లాంటివీ పోతాయి.

జలుబు, దగ్గు, పడిశం లాంటివి వచ్చినపుడు నోట్లో ఓ లవంగం వేసుకొని చప్పరించాలి. ఇలా రోజుకు మూడు నాలుగు లవంగాల్ని చప్పరిస్తే ముక్కు సమస్యలు దూరమవుతాయి.

లవంగాలు తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్‌ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాదు… లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని తగ్గిస్తుంది. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి.

లవంగాలు మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్ని అందిస్తాయని తెలుసా. విటమిన్ సి , కే, ఫైబర్ (పీచు), మాంగనీస్, కాలరీలు, పిండిపదార్థాలను లవంగాలు అందిస్తాయి. మనకు గాయం అయినప్పుడు రక్తం కారిపోకుండా గాయమైన ప్రదేశం దగ్గర రక్తం గడ్డకట్టాలంటే విటమిన్ K అవసరం. అది లవంగాల్లో దొరుకుతుంది.

లవంగాలు కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి.

మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు మన ఎముకలకు అవసరం అవుతుంది. బోన్స్ బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది.