ఈ నెల 15 నుంచి ఒంటిపూట బ‌డులు

247
half day school timetable in ap 2018

హైద‌రాబాద్ః ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా కొనసాగుతున్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు.



ఇక ఉన్నత పాఠశాలల్లో ఐచ్ఛిక సెలవుల విధానాన్ని మార్చుతూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించారు. ఐచ్ఛిక సెలవులను ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కాకుండా పాఠశాల పరంగా తీసుకోవాలని పేర్కొన్నారు.