దక్షిణ భారతీయుల వంటకాల్లో మునగకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నింటినీ వంటలో వాడుకుంటారు.
మునగలో విటమిన్ ఎ, సి, లతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు ఈ మునగ వల్ల నయమవుతాయి.
ఆరోగ్యానికి సరిపడా అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. మునక్కాయ రుచిలోనూ ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది.
అంతేకాదు వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ దోహదపడుతుంది.
మునక్కాయలో విటమిన్ ‘సి’ ఎక్కువ మోతాదులో ఉంటుంది. జలుబు చేసినపుడు మునక్కాయ తింటే ఉపశమనం లభిస్తుంది. మునగలో లభించే పీచు, ఇతర పోషకాలు మలబద్ధకం సమస్య లేకుండా చేస్తాయి.
జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మునగ వల్ల ఆస్తమా, శ్వాసకోశ వంటి రుగ్మతల నుంచి విడుదల కలుగుతుంది. అంతేకాదు ఎముకలు ధృఢంగా ఉంటాయి.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. మునక్కాయలో ‘బి’ విటమిన్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
శక్తిని అందించే ఫోలేట్లూ, విటమిన్ బి6, థయామిన్, రైబోఫ్లెవిన్ వంటివి మునక్కాయలో పుష్కలంగా ఉన్నాయి.
గర్భిణులు మునక్కాయను ఎక్కువగా తినడం వల్ల ప్రసవ సమయంలో నొప్పుల బాధ తగ్గుతుంది.
ప్రసవం తర్వాత వచ్చే చాలా సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
తల్లిపాలు వృద్ధి అవుతాయి. మునక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ.
మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేకం. ఇవి వ్యాధులకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.