విసిగించే చుండ్రు సమస్యకు ఉసిరితో పరిష్కారం

498
dandruff problem

ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి.

ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్‌ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు తగ్గుతుంది.