రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2018 విద్యా సంవత్సరానికి వివిధ సాంకేతిక కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మొత్తం 41,947 సీట్లు ఉన్నాయి. 54 ప్రభుత్వ ఐటీఐలు, 205 ప్రైవేట్ ఐటీఐల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ ఐటీఐల్లో 9,326, ప్రైవేట్ ఐటీఐల్లో 32,621 సీట్లున్నాయి. మొత్తం 10 కోర్సుల్లో అడ్మిషన్ ప్రకియ జరుగుతుందని హైదరాబాద్ లోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ వర్గాలు తెలిపాయి.
సోమవారం ఆన్‌లైన్ పోర్టల్ ఓపెన్ అయింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 27లోగా సమర్పించాలి. 30 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వికలాంగుల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జూలై 2, 3 తేదీల్లో ఉంటుంది. మార్కులు, ప్రతిభా ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వచ్చే నెల నాలుగున ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 7న సీట్లు కేటాయిస్తారు.