రాశి ఫలాలు – మంగళవారం 25 జూన్ 2019

212
today horoscope details

శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; బహుళ పక్షం అష్టమి: రా. 12.50 తదుపరి నవమి ఉత్తరాభాద్ర నక్షత్రం: రా. 3.08 తదుపరి రేవతి అమృత ఘడియలు: రా. 9.51 నుంచి 11.37 వరకు వర్జ్యం: ఉ. 11.19 నుంచి 1.04 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.07 నుంచి 9.00 వరకు తిరిగి రా. 10.56 నుంచి 11.40 వరకు రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.5-31; సూర్యాస్తమయం: సా.6.33

మేషరాశి
సంఘంలో పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

వృషభరాశి
ఋణ బాధలు ఎదురై చికాకులు పెడతాయి. అధిక శ్రమ తప్పదు. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో స్థాన చలనం సంభవం.

మిథునరాశి
ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యులతో ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు.

కర్కాటకరాశి
పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

సింహరాశి
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కన్యరాశి
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి కొంత మెరుగుపడుతుంది.

తుల రాశి
బంధువులతో ఏర్పడిన ఆర్ధిక వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు తగదు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికరాశి
ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనుస్సు రాశి
జీవితభాగస్వామితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

మకరరాశి
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. శ్రమకు తగిన ఫలితం దక్కదు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కుంభరాశి
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. జీవితభాగస్వామి నుంచి ధన సహాయం పొందుతారు. స్వల్ప ధనలాభం ఉంది.

మీనరాశి
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఏర్పడిన కలహాలను పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు.