ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 03 సెప్టెంబర్ 2019

284
today horoscope details

శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం, వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్ల పక్షం, చవితి: ఉ. 7-04 తదుపరి పంచమి తె.5.12, చిత్త నక్షత్రం: మ. 12-25, వర్జ్యం: సా. 5-45 నుంచి 7-17 వరకు, దుర్ముహూర్తం: ఉ. 8-17 నుంచి 9-06 వరకు, తిరిగి రా. 10-49 నుంచి 11-36 వరకు, రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు, సూర్యోదయం: ఉ.5-48; సూర్యాస్తమయం: సా.6.12

మేష రాశి : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా అనుకోని సాయం అందుతుంది. శివారాధన చేయటం మంచిది.

వృషభ రాశి : ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహ శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. సమయానికి డబ్బు అందటం వల్ల ఆర్థిక పరమైన సమస్య తొలగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి.

మిథున రాశి : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటక రాశి : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.మీ సంతానం గురించి కానీ, ఏదైనా పోటీ విషయంలో డబ్బు ఖర్చవుతుంది.

సింహ రాశి : ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది. కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.

కన్య రాశి : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. విలాసాల కోసం ఖర్చు అధికంగా చేస్తారు. పెట్టుబడులకు, నూతన ఒప్పందాలకు అనువైన రోజు కాదు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

తుల రాశి : మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు, నూతన వ్యాపార సంబంధ లేదా గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనుస్సు రాశి : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకర రాశి : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

కుంభ రాశి : ఈ రోజు చేసే పనిలో అడ్డంకులు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే తలపెట్టిన ప్రయాణాలు వాయిదా పడుతాయి. అయితే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అడ్డంకులు ఏర్పడినప్పటికీ నిరాశకు లోనవకుండా పని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితుల సహాయం అందుకుంటారు. గృహ సంబంధ వ్యవహారాలపై డబ్బు ఖర్చు చేస్తారు.

మీన రాశి : ఈ రోజు అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. తక్కువ శ్రమతో అనుకున్నది సాధిస్తారు. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి ద్వారా అనుకోని సాయం అందుకుంటారు.