శిలాఫలకానికి బర్త్ డే వేడుకలు

454
birthday-celebrations-to-foundation-stone

ఇదేందో సిత్రంగా ఉంది కదా… అయితే ఒక్కసారి ఈ ముచ్చట సూడుండ్రి…

తమ ఊర్ల మధ్య రోడ్డు నిర్మాణం కోసం శిలాఫలకం వేసి సంవత్సరం అయిన పనులు ఇంకా మొదలు పెట్టడలేదని ఇగో గిట్ల జేసిండ్రు ఆ ఉరోళ్ళు…

జగిత్యాల జిల్లాలోని మన్నెగూడం భీమారం గ్రామాల మధ్య రోడ్డు వేస్తామని చెప్పి సంవత్సరం అయిన ఎవ్వరు పట్టించుకోవడం లేదట…దింతో ఆగ్రహించిన మన్నెగూడం యువకులు ఇగో గీ రీతిలో నిరసన వ్యక్తం జేసిండ్రు…

ఆ శిలాఫలకం ప్రారంభించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శిలాఫలకం ముందు కేక్ కట్ చేసి, ఆ కేకును ఆ శిలాఫలకానికే పూసి పుట్టినరోజు వేడుకలు జరిపిండ్రు…
గమ్మతుంది కదా గీ ముచ్చట…

ఇగ సూడాలి మరి… ఇప్పుడన్న వాళ్ళ ఊర్లకు రోడ్డు వేస్తారో లేదో…