ఈ రోజు రాశి ఫలితాలు–శనివారం 06 జులై 2019

240
today rashi phalalu

మేష రాశి : ఈ రోజు మీ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో లేదా ప్రమోషన్ల విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీపిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు.

వృషభ రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగాఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణంకానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. దైవదర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్నిసందర్శించటం కానీ చేస్తారు.

మిథున రాశి : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగాఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూసంబంధ వ్యవహారాలు ఒకకొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.

కర్కాటక రాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీవృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలోప్రమోషన్లు లేదా బదిలీ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహ రాశి : ఈ రోజుమానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పనిచేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదావేసే అవకాశముంది. ఆహార విషయంలోజాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్యవచ్చే అవకాశముంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలదినం కాదు.

కన్య రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసేప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలోఅనుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూలదినం కాదు. ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శిస్తారు.

తుల రాశి : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందిపడే అవకాశముంటుంది.

వృశ్చికం రాశి : ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకో గలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలంగాఉంటుంది.

ధనుస్సు రాశి : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, గతంలో ఆగిపోయిన పనులు పూర్తిచేయటానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోని సాయం కారణంగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. మీశ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

మకర రాశి : ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. పెట్టుబడులకు అనువైనరోజు కాదు. బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి.

కుంభ రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలుకానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్తపనులకు అనుకూలమైనరోజుకాదు.

మీన రాశి : మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్తపనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపార వ్యవహారాలు కానీ, ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు.