ఏనుగు ఐదేళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుక … వీడియో

221

ఏనుగుకు స్వాతంత్య్రం రావడమేంది.. అని అంటారా? ఏనుగుకు 50 ఏళ్ల తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. అంటే అది 50 ఏళ్లు ఉత్తర ప్రదేశ్‌లో ఓ వ్యక్తి చేతిలో బంధీగా ఉండేది. ఆ ఏనుగు ఓనర్ దాన్ని అడ్డం పెట్టుకొని ఉత్తర ప్రదేశ్ లో రోడ్లు మీద బిచ్చమెత్తుకునేవాడు. అలా 50 ఏళ్ల పాటు దాన్ని బంధీగా ఉంచుకున్నాడు. అయితే.. 2014లో దాన్ని వైల్డ్ లైఫ్ ఎస్‌వోఎస్ అనే ఎన్‌జీవో కాపాడింది.

ఆ ఏనుగుకు రాజు అని పేరు పెట్టారు. దాన్ని కాపాడి ఐదేళ్లు అయిన సందర్భంగా కేక్ కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అది మథురలో ఉంది. అక్కడ ఉన్న ఏనుగుల సంరక్షణ కేంద్రంలో దాని బాగోగులు చూసుకుంటున్నారు. అక్కడే దానికి స్వాతంత్య్రం వచ్చి ఐదేళ్లు అయిన సందర్భంగా సంబురాలు చేసుకున్నారు. ఏనుగు కూడా ఆ కేక్‌ను లొట్టలేసుకుంటూ తినేసింది.