శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం వసంత రుతువు; చైత్ర మాసం; శుక్ల పక్షం విదియ: మ. 3.14 తదుపరి తదియ అశ్విని నక్షత్రం: ఉ. 8.15 తదుపరి భరణి అమృత ఘడియలు: తె. 4.05 నుంచి 5.44 వరకు వర్జ్యం: సా. 6.10 నుంచి 7.49 వరకు దుర్ముహూర్తం: సా. 4.32 నుంచి 5.21 వరకు రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు సూర్యోదయం: ఉ.5-55; సూర్యాస్తమయం: సా.6.09
మేషరాశి : అదృష్టవంతమైన రోజు. మీ సహోద్యోగులు లేదా పైఅధికారుల ప్రశంసలు పొందుతారు. మీపై గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ పదోన్నతి విషయంలో శుభవార్త కానీ వింటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పని పూర్తి చేయగలుగుతారు.
వృషభరాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కళ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం బారినపడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వలన అసహనానికి, ఉద్రేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గతంలో తీసుకున్న లోన్ లేదా అప్పు చెల్లిస్తారు.
మిథునరాశి : ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాత మిత్రులను కలువడం జరుగుతుంది. మీ సంతానం కారణంగా ఆనందాన్ని పొందుతారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి.
కర్కాటకరాశి : చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న భూ లేదా గృహ సంబంధ విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మిత్రుల కారణంగా ఒక ముఖ్యమైన పని పూర్తి చేయగలుగుతారు.
సింహరాశి : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణం ఉంటుంది. ఉద్యోగం విషయంలో మార్పు ఉంటుంది.
కన్యరాశి : మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావంతో మెలగండి. వారితో గొడవలకు దిగడం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించడానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవడం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.
తులరాశి : మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. వాటి కారణంగా అనవసర ఇబ్బందులు ఏర్పడే అవకాశముటంది.
వృశ్చికరాశి : ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడికి సంబంధించిన డబ్బు సకాలంలో అందుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ధనుస్సురాశి : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. మిత్రులకు లేదా సహోద్యోగులకు ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది.
మకరరాశి : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.
కుంభరాశి : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. పోగొట్టుకున్న వస్తువులు కానీ, డబ్బు కానీ తిరిగి పొందుతారు.
మీనరాశి : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది.