రూ.1.02కోట్లు విలువైన జనసేన ప్రలోభాలు

630
tokens seized

చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్‌ గెలుపొందేందుకు ఓటర్లకు ఎర వేస్తున్న ప్రలోభాల పర్వం బయటపడింది. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తూ జనసేన నేతలు దొరికిపోయారు. టోకెన్లను పంచుతూ.. సెంటర్ పేరు చెప్పి అక్కడకు వస్తే రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు ఏర్సాట్లు చేశారు. కాగా టోకెన్లను పంపిణీ చేస్తున్న 12 మంది జనసేన కార్యకర్తలను పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

పుంగనూరు సమీపంలోని క్రిష్ణమరెడ్డిపల్లె, బోడినాయినిపల్లె పరిసరాల్లో 8 మంది జనసేన కార్యకర్తలు ముద్రించిన రూ.2 వేలు టోకెన్లను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, శివకుమార్‌లు మాటు వేసి పట్టుకున్నారు. పట్టుకున్నవారి నుంచి రూ.12లక్షల విలువైన 600 టోకెన్లను, రూ.46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

చౌడేపల్లెలో కూడా టోకెన్లు పంపిణీ చేస్తుండగా నలుగురు యువకులను పట్టుకుని 1,600 టోకెన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగిరిగుంట చెక్‌పోస్ట్‌ వద్ద 5,000 టోకెన్లను డ్రైవర్‌ సీటు క్రింద దాచినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.92 లక్షలు. పుంగనూరు, చౌడేపల్లిలో రూ.1.02 కోట్ల విలువజేసే టోకెన్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరులో నాలుగు కేసులు, చౌడేపల్లెలో రెండు కేసులను జనసేన పార్టీపై నమోదయ్యాయి.