మేష రాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో, కోర్టు కేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతున్నది. లోన్, ఆర్థిక సాయం కొరకు ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం ఉంటుంది.
వృషభ రాశి : మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్న వారికి వారు అనుకున్న సాయం అందుతుంది. సంతానం గురించి ఎదురుచూస్తున్నవారికి అనుకూల ఫలితం దక్కుతుంది.
మిథున రాశి : ఈరోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి, వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈరోజు తీసుకోవచ్చు.
కర్కాటక రాశి : వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కానీ ఉంటుంది.
సింహ రాశి : ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయేసరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు.
కన్య రాశి : మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి తూచి అడుగేయండి. కొన్ని నిర్ణయాలతో భవిష్యత్లో ఇబ్బందిపడే అవకాశముంటుంది.
తుల రాశి : కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చిక రాశి : ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.
ధనుస్సు రాశి : మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల నుంచి అనుకోని బహుమతి కానీ, ప్రశంస కానీ అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
మకర రాశి : మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.
కుంభ రాశి : మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.
మీన రాశి : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవిత భాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.