26 డిసెంబర్ 2018 బుధవారం మీ రాశి ఫలాలు

259
today rashi phalalu

మేషం : బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం మార్పు విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఊరటనిస్తాయి. తల పెట్టిన పనులు కొలిక్కి వస్తాయి.

వృషభం : స్టేషనరీ, రవాణా, ఏజెన్సీ, రక్షణ, న్యాయ, బోధన, పర్యాటక రంగాల వారికి శుభప్రదం. వాహన సౌకర్యం కలుగుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. కీలక సందేశాలు అందుకుంటారు.

మిథునం : ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. షాపింగ్‌, క్రయవిక్రయాలకు అనుకూలం. రుణ ప్రయ త్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవు తాయి. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు సమకూర్చు కుంటారు.
 

కర్కాటకం : వేడుకలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో విజయం సాధిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం.

సింహం : చేపట్టిన పనులను సమీక్షించుకుంటారు. గత అనుభవంతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. డైటింగ్‌, యోగధ్యానాలపై దృష్టి పెడతారు. సహోద్యోగులకు సంబంధించిన రహస్య సమాచారం అందుకుంటారు.

కన్య : ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. స్నేహానుబంధాలు వికసిస్తాయి.

తుల : గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రమోషన్లు, బదిలీలు, మార్పు లకు అనుకూల సమయం. పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం : ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. చర్చల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కళలు, సాహిత్యం, ప్రణాళికలు, టూరిజం రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. డ్రైవింగ్‌లో నిదానం పాటించండి.

ధనుస్సు : విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మూచ్యువల్‌ ఫండ్స్‌ లావాదేవీలు లాభిస్తాయి. బీమా, గ్రాట్యుటీ, పింఛన్‌ వ్యవహారాలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. విందుల్లో పాల్గొంటారు.
మకరం : జన సంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీలపై దృష్టి పెడతారు. భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. న్యాయ, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఖర్చులు అధికం.

కుంభం : ఆహార నియమాలు పాటిస్తారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. పనివారి నియామకానికి అనుకూలం. వృత్తి, వ్యాపార విషయాలను సమీక్షించుకుంటారు.

మీనం : ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. విద్య, క్రీడలు, బ్యాంకుల రంగాల వారికి ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. ఖర్చులు అధికం.