రేపటి నుంచి ఓటర్ల నమోదు

561

ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమాయత్తం అవుతోంది.
రేపటి నుంచి జనవరి 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటుహక్కు లేనివారు, జాబితాలో పేర్లు గల్లంతైనవారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వయోజనులందరు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.
 

దరఖాస్తులను, అభ్యంతరాలు, ఫిర్యాదులను ఫిబ్రవరి 11వ తేదీలోగా పరిష్కరించి, ఫిబ్రవరి 22న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో లేదా ఎమ్మార్వో కార్యాలయాలు, పోలింగ్ బూత్‌లవారీగా ఎన్నికల అధికారులు నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.80 కోట్ల మంది ఓటర్లున్నారు. తాజా ఓటరు నమోదు ప్రక్రియలో మరో 20 లక్షల మంది నమోదవుతారని అంచనా. దీన్ని బట్టి తుది జాబితా లో రాష్ట్ర ఓటర్లు మూడు కోట్లు దాటుతారని అధికా రులు చెప్తున్నారు.