రాశి ఫలాలు – మంగళవారం 20 మార్చి 2018

307
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేషం : మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహా రం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉం డటం మంచిది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయా ల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

వృషభం : కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిపాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.



 

మిథునం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంస కానీ పొందుతారు. ఇంటికి సం బం ధిచిన వస్తువులు కొలుగోలు చేస్తారు. అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయం సాధిస్తారు.

సింహం : రోజువారీ కార్యకమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు.

కన్య : మానసికంగా అశాంతితో ఉంటారు. అవమానం కానీ, భ యం కానీ ఎదురవుతుంది. నిర్ణయాలు తీసుకోవటానికి అను వైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం కావచ్చు. ఖర్చుల విషయంలో జాగత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది.


తుల : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి సినిమా, ఇతర వినోద కార్యకమాలకు వెళతారు. బంధువులు, మిత్రులతో గొడవలు సమసిపోతాయి.

వృశ్చికం : ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావటం కానీ, లోన్ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయా ల కు సామాన్యంగా ఉంటుంది. వివాదాల్లో విజయం సాధిస్తారు. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిపాయాన్ని వ్యక్తపరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సా హం కలగలుపుగా ఉంటాయి. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యకమాల్లో పాల్గొంటారు. పోటి పరీక్షలు రాసే వారు జాగత్తగా ఉండటం మంచిది

మకరం : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనటం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. విశ్రాంతిగా ఉండటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.


కుంభం : చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. కొత్త బట్టలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేస్తా రు. మీ భావోద్యేగాలను, అత్యుత్సాహాన్ని కొంత అదుపులో ఉంచుకోవటం మంచిది.అనవసర ఖర్చులుంటాయి.

మీనం : ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బులు వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వెళ్లిపోతాయి. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం. భావోద్వేగాలను అదుపులో ఉంచాలి.