ఈ రోజు రాశి ఫలితాలు–మంగళవారం 30 జులై 2019

273
today rashi phalalu

మేష రాశి : ఈ రోజు ఇంటిపట్టున ఉండి చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు లేదా భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృషభ రాశి : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశం నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పుకానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉంటుంది.

మిథున రాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనటం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు.

కర్కాటక రాశి : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

సింహ రాశి : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

కన్య రాశి : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనాదాయం ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు ఈ రోజు ఏ ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు.

తుల రాశి : ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

వృశ్చిక రాశి : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

ధనుస్సు రాశి : ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనవకుండా స్థిమితంగా ఉండటం మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

మకర రాశి : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తా రు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

కుంభ రాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావటం కానీ, లోన్ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

మీన రాశి : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలు రాసే వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.