శ్రీ వికారి నామ సం।।రం।। దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; బహుళ పక్షం చతుర్దశి: సా.6-56 తదుపరి అమావాస్య ఆశ్లేష నక్షత్రం: రా.8-17 తదుపరి మఘ అమృత ఘడియలు: సా.6-46 నుంచి 8-16 వరకు వర్జ్యం: ఉ.9-44 నుంచి 11-15 వరకు దుర్ముహూర్తం: ఉ.9-56 నుంచి 10-46 వరకు తిరిగి మ.2-55 నుంచి 3-44 వరకు రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5-48; సూర్యాస్తమయం: సా.6.14 మాస శివరాత్రి
మేష రాశి : ఈ రోజు పనుల విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక ైస్థెర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు ప్రయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యవిషయంలో కొంత సామాన్యం గా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
మిథున రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్ కు అనుకూల దినం.
సింహ రాశి : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.
కన్య రాశి : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
తుల రాశి : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విదేశీసంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.
వృశ్చిక రాశి : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
ధనుస్సు రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.
మకర రాశి : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తొలగి పోతాయి. మీ భాగస్వామి నుంచి సహాయం అందుకుంటారు.
కుంభ రాశి : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. ఆర్థిక సంబంధ లావాదేవీలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. ఆచితూచి అడుగేయటం మంచిది. శతృబాధ తొలగి పోతుంది.
మీన రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, కడుపునకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. బంధువుల కారణంగా లేదా వాహన కారణంగా డబ్బు ఖర్చవుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం.