మేష రాశి : వ్యాపార, వృత్తి విషయంలోఅనుకూలమైనరోజు. ఆయా రంగా ల్లో అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతోపరిచయాలు ఏర్పడతాయి. అమ్మటానికి చూస్తున్న స్థిరాస్థి అమ్ముడవుతుంది.
వృషభ రాశి : ఈ రోజు కొత్తవారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికిసంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రి గారి ఆరోగ్యంవిషయంలోజాగ్రత్త అవసరం.
మిథున రాశి : ప్రతిపనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులుచేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలంకాదు.
కర్కాటక రాశి : ఈ రోజు మీ మిత్రులను కలుసుకుంటారు. అలాగే ప్రయాణంలోఅనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకుఅనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూలఫలితం పొందుతారు.
సింహ రాశి : ఈ రోజుఉద్యోగ విషయంలోకానీ, ప్రయాణంవిషయంలోకానీ ఒక ముఖ్యమైన నిర్ణయంతీసుకుంటారు. వ్యాపారలావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందర పడి నిర్ణయాలు తీసుకోవటంకానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలుతీసుకోవటం కానీ మంచిదికాదు.
కన్య రాశి : మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తికాక పోవటంలేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీపిల్లలఆరోగ్య విషయంలోజాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలకు అనుకూల దినంకాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి
తుల రాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీకుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యంకూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలోజాగ్రత్త అవసరం.
వృశ్చిక రాశి : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగాఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగాఆత్మీయులతోవివాదాలు ఏర్పడటంకానీ, వారి కోపానికిగురవటం కానీజరగవచ్చు. ఉద్యోగం, పని విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. మీబంధువులలోఒకరి నుంచి అనుకోని సాయాన్నిపొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ధనుస్సు రాశి : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటంమంచిది. మీమాట తీరుకానీ, వ్యవహారశైలికానీ ఎదుటివారిని ఇబ్బందిపెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దానికారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగాసామాన్యంగాఉంటుంది. ఉద్యోగంలోఅనుకోనిమార్పులు చోటు చేసుకోవచ్చు.
మకర రాశి : మీస్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీజీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలోఉండాలని, కుటుంబసభ్యులతో గడపాలనికోరుకుంటారు. ఆర్థికవిషయాలు పెద్దగా అనుకూలించవు
కుంభ రాశి : ఆర్థికంగా సామాన్యంగాఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసివస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికిలోనవుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండాచూసుకోండి. అలాగే ఇతరులతోవ్యవహరించేటప్పుడు కూడాజాగ్రత్త అవసరం.
మీన రాశి : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగాఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటంకానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టినపనులు సులువుగాపూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలోకానీ అనుకోనిశుభ పరిణామాలుంటాయి. మీపిల్లల గురించి శుభవార్త వింటారు.