ఈ రోజు రాశి ఫలితాలు–బుధవారం 10 మార్చ్ 2021

412
today horoscope details

మేష రాశి Aries: ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుసుకుంటారు.

వృషభ రాశి Taurus: క్షణికావేశం పనికిరాదు. రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్ళకండి. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.

మిథున రాశి Gemini: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

కర్కాటక రాశి Cancer: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆదాయానికి చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అన్నివిధాలా సుఖంగా వుంటారు.

సింహ రాశి Leo: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు కొంత బాధిస్తాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ధనవ్యయం తప్పదు.

కన్య రాశి Virgo: మానసిక ఆనందం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన పనులను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది.

తుల రాశి Libra: ఇతరుల విమర్శలకు లోనవుతారు. అనుకూల స్థానచలనం కలిచే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం జరిగే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చిక రాశి Scorpio: కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడండి.

ధనుస్సు రాశి Sagittarius: బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.

మకర రాశి Capricorn: పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులతో గౌరవింపబడుతారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది.

కుంభ రాశి Aquarius: చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు, మానసిక ఆందోళన తప్పదు. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి Pisces: కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు.