ఈ రోజు రాశి ఫలాలు – సోమవారం 01 జులై 2019

305
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

శ్రీ వికారి నామ సం।।రం।। ఉత్తరాయణం గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; బహుళ పక్షం
చతుర్దశి: రా. 2.24 తదుపరి అమావాస్య, రోహిణి నక్షత్రం: ఉ. 8.50 తదుపరి మృగశిర
అమృత ఘడియలు: ఉ. 5.36 నుంచి 7.13 వరకు తిరిగి రా. 11.50 నుంచి 1.25 వరకు
వర్జ్యం: మ. 2.21 నుంచి 3.56 వరకు దుర్ముహూర్తం: మ. 12.28 నుంచి 1.20 వరకు
తిరిగి మ. 3.04 నుంచి 3.56 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు, సూర్యోదయం: ఉ.5-32; సూర్యాస్తమయం: సా.6.32

మేష రాశి
ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలోజాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

వృషభ రాశి
ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి.

మిథున రాశి
ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కాని అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

కర్కాటక రాశి
పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులనుకానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరుఅనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అలసట, ఒత్తిడి అధికంగాఉంటాయి.

సింహ రాశి
ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చుపైన పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కన్య రాశి
స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.

తుల రాశి
ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి.

వృశ్చిక రాశి
మీరు ఎంతో ఇష్టంతో చేపట్టినపని వాయిదా పడటం, అలాగేసాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కోసం పిల్లలతో గడపటం కానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది.

ధనుస్సు రాశి
ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపునొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకర రాశి
మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురిచేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభ రాశి
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దాని వల్ల మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది.

మీన రాశి
స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.