మేషరాశి :ఈ రోజు మీరి అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం లేదా అనుకోని అడ్డంకులు రావడం వల్ల మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబం ధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి .
వృషభరాశి :ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.
మిథునం :ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటకరాశి :ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.
సింహరాశి :ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.
కన్యరాశి :ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కానీ, విలువైన వస్తువులు నష్టపోవడం కానీ జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అపరిచితులను నమ్మకండి. మాట కారణంగా వివాదం రావడం కానీ, సమస్య రావడం కానీ జరుగుతుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం.
తులరాశి :ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.
వృశ్చికరాశి :ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవడానికి అనుకూల దినం.
ధనుస్సురాశి :ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.
మకరరాశి :ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతా రు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.
కుంభరాశి :ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి దేవాలయ సందర్శన కానీ, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి :ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి అనుకోని మార్పు ఉంటుం ది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం కానీ, ప్రయాణం చేయాల్సి కానీ వస్తుంది. మీ సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశమున్నది. దాని కారణంగా అవమానానికి కానీ, నిర్లక్ష్యానికి కానీ గురవుతారు. ఆర్థిక లావాదేవీలకు అంతగా అనువైన రోజు కాదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.