శనివారం 26 జనవరి 2019 రాశి ఫలాలు

273
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేషం : శారీరకంగా బాగున్నప్పటికీ, మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. పని చేయాలనే ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఎక్కువగా విశ్రాంతి కోరుకుంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. బంధువులను కలుసుకొంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.




 

వృషభం : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం కానీ చేస్తారు.

మిథునం : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

కర్కాటకం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్య : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలమిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో కానీ, శుభకార్యాల్లో గాని పాల్గొంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి.


తుల : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా మిత్రులతో సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.

వృశ్చికం : ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకో గలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

ధనుస్సు : కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సాయం చేయటం కానీ, తన సాయం అందుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రయాణం కానీ, దైవ దర్శనం కానీ చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.



కుంభం : ఆరోగ్య విషయంలో ఈ రోజు జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మీనం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి పనుల్లో సాయం చేస్తారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది.