రాశి ఫలాలు – 02 శనివారం జూన్ 2018

294
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేషరాశి : ఈ రోజు వ్యాపారంలో, మీరు చేపట్టిన పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. కొత్తవారితో పరిచయాలకు, స్నేహాలకు అనుకూలమైన రోజు. ఇతరుల ప్రభావానికి, ఒత్తిడికి లోను కాకండి. దాని కారణంగా అనవసర సమస్యలు ఏర్పడతాయి. స్థిరమైన ఆలోచనలతో ఉండండి, భూమి, ఇల్లు అమ్మకానికి అనుకూలమైన రోజు.

వృషభరాశి : ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ, విదేశీ యానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.



 

మిథునరాశి : ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం జరుగవచ్చు.ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక ైస్థెర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

కర్కాటకరాశి : ఈరోజు మీ మిత్రులను కలుసుకోవడం జరుగుతుం ది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతున్నది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధన లాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు.

సింహరాశి : ఈరోజు ఉద్యోగం, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

కన్యరాశి : ఈరోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం, అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.


తులరాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర, ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికరాశి :ఈరోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యోగం, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సురాశి : ఈరోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహారశైలి కానీ ఎదుటి వారిని ఇబ్బందిపెట్ట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తల దూర్చకండి. దీంతో మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

మకరరాశి : ఈరోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగం విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

కుంభరాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మీనరాశి : ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.