రాశి ఫలాలు – 17 ఆదివారం జూన్ 2018

498
horoscope-details

మేషరాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు

వృషభరాశి : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.

మిథునరాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకరాశి : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.



 

సింహరాశి : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

కన్యరాశి : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. అనుకోని విధంగా డబ్బు ఖర్చయ్యే అవకాశమున్నది

తులరాశి : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అనుకోని అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఈ రోజు ప్రయత్నం ప్రారంభించటం మంచిది.

వృశ్చికరాశి : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలిగి పోతాయి.



 

ధనుస్సురాశి : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

మకరరాశి : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. జ్వరం లేదా వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలుంటాయి. అలాగే గొప్పలకు, పోటీలకు పోయి డబ్బు ఖర్చు చేయకండి. దాని వల్ల డబ్బు ఖర్చవటమే కాకుండా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపార విషయంలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు.

కుంభరాశి : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం.

మీనరాశి : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది.వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు.