డాక్టర్! మా ఆవిడకు నాల్గవ నెల. గర్భం ధరించక ముందు మా లైంగిక జీవితం ఎంతో చక్కగా సాగింది. కానీ ఇప్పుడు సెక్స్ మీద ఆవిడకు ఆసక్తి సన్నగిల్లింది. గర్భం ధరిస్తే లైంగిక ఆసక్తిలో మార్పులు వస్తాయా?
గర్భం దాల్చడం వల్ల లైంగికాసక్తిలో మార్పులు చోటుచేసుకోవడం అత్యంత సహజం. కొంతమంది మహిళల్లో గర్భధారణ తర్వాత హార్మోన్ల స్రావాలు పెరగడం వల్ల లైంగికాసక్తి పూర్వం కంటే పెరిగితే, మరికొందరిలో తగ్గుతుంది. మరీ ముఖ్యంగా మొదటి మూడు నెలల కాలంలో ఎక్కువశాతం మంది మహిళలకు పెరుగుతున్న పొట్ట కారణంగా అసౌకర్యానికి, అలసటకు లోనై లైంగికంగా కూడా అనాసక్తిగా ఉండిపోతారు. మరికొందరు మహిళలు అంతకుముందుకు మించి హుషారుగా సెక్స్‌లో పాల్గొంటూ ఉంటారు. ఇది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీ ఆవిడ విషయంలో మీరు ఓర్పుగా ఉండక తప్పదు. గర్భధారణతో ఆమెకు కలుగుతున్న అసౌకర్యాల పట్ల స్పందిస్తూ, ప్రసవం గురించి నెలకొన్ని ఉన్న భయాలను పోగొడుతూ అన్యోన్యంగా మెలిగే ప్రయత్నం చేయండి. సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భంలో ఉన్న బిడ్డ మీద ఎటువంటి ఒత్తిడీ పడదనీ భరోసా ఇవ్వండి. వైద్యులను కలిసి కౌన్సెలింగ్ ఇప్పించండి. మీ సమస్య తేలికగానే పరిష్కారమవుతుంది.