రాశి ఫలాలు – బుధ‌వారం 20 మార్చి 2019

353
today rashi phalalu

శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం చతుర్దశి: ఉ.9.52 తదుపరి పూర్ణిమ పుబ్బ నక్షత్రం: మ.3.56 తదుపరి ఉత్తర అమృత ఘడియలు: ఉ.9.56 నుంచి 11.26 వరకు వర్జ్యం: రా.10.41 నుంచి 12.11 వరకు దుర్ముహూర్తం: మ.11.44 నుంచి 12.32 వరకు రాహుకాలం: మ.12.00ల 1.30 వరకు సూర్యోదయం: ఉ.6-09; సూర్యాస్తమయం: సా.6.06

మేష రాశి : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.



వృషభ రాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు
కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథున రాశి : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావాల్సిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ
వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

కర్కాటక రాశి : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడడం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే , పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

సింహ రాశి : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. వివాదాల్లో విజయం సాధిస్తారు.

కన్య రాశి : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

తుల రాశి : ఈ రోజు మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

వృశ్చిక రాశి : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు రాశి : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.



మకరం రాశి : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. గనుక జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

కుంభం రాశి : ఈ రోజు మీ దాంపత్య జీవితంలో ఆనందకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు తొలిగిపోతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం రాశి : ఈ రోజు వృత్తిలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అనుకూలమైన రోజు. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వివాదాల్లో విజయం సాధిస్తారు. మానసికంగా కొంత ఆందోళనకు లోనయినప్పటికీ, మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.