విజయశాంతికి కీలక పదవి ?

274
congress leader vijayashanthi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సత్తా ఏంటో చూపించాలని వ్యూహాలు రచిస్తోంది. అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసలు ఎన్నికల్లో ఎలా ఎలా ముందుకెళ్లాలి..? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? ఎవరెవరు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి..? అనే విషయాలను బేరీజు చేసుకున్న అధిష్టానం పలు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతి వారి కథనం ప్రకారం ఈ కమిటీల్లో సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, మధుయాష్కీలకు కాంగ్రెస్ పెద్దలు కీలక బాధ్యతలు అప్పగించారు.




 

పబ్లిసిటీ కమిటీ ఏర్పాటు
మొత్తం 16మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియామకం

క్యాంపెయినర్ కమిటీ
మొత్తం 20మందితో క్యాంపెయిన్ కమిటీ ఏర్పాటు
కమిటీ చైర్మన్‌గా మహిళా నేత విజయశాంతి నియామకం

కో-ఆర్డినేషన్‌ కమిటీ
మొత్తం 37మందితో కో-ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు
కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ఎంపిక

ఎలక్షన్ కమిటీ
మొత్తం 24మంది సభ్యులతో ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
కమిటీకి చైర్మన్‌గా ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియామకం.

మీడియా కో ఆర్డినేషన్ కమిటీ
కమిటీ బాధ్యతలను సీనియర్ నేత యధుయాష్కీకి అప్పగింత