రూ.700ఖర్చు పెట్టి .. రూ.7కోట్లు

232
1 million lottery

అమెరికాలో నివాసముంటున్న శామ్ పటేల్ కొత్తగా ఓ షాపు కొన్నాడు. అక్కడ రకరకాల వస్తువులు లభిస్తాయి. అదో వెరైటీ స్టోర్. అక్కడికి రెగ్యులర్‌గా ఓ కస్టమర్ వచ్చేవాడు. అతనికి లాటరీలంటే కొంచెం పిచ్చి. రోజూలాగే ఆ స్టోర్‌కి వచ్చిన అతను ఓ లాటరీ తీస్తే 10డాలర్లు(రూ.700పైగా) వచ్చాయి. దాంతో సంతృప్తి చెందని ఆ వ్యక్తి, తాను గెలిచిన మొత్తానికి వెంటనే లాటరీలు కొనేశాడు. అతను ఏ నక్క తోక తొక్కాడో కానీ, ఆ రోజు అతని నెత్తిన అదృష్ట దేవత తాండవం చేస్తున్నట్లుంది.




 

700 పెట్టి కొన్న టికెట్లలో ఒక దానికి ఏకంగా పదిలక్షల డాలర్లు (ఏడు కోట్లకు పైగా) వచ్చాయి. దాంతో అతను రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. తనకు ఆ టికెట్ అమ్మినందుకు శామ్‌కు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తన కస్టమర్‌ను లాటరీ వరించడం తనకు కూడా చాలా సంతోషం కలిగించిందని శామ్ చెప్పారు.