విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో పాము ప్రత్యక్షమైన ఘటన నాందెడ్‌లో వెలుగుచూసింది. గర్గావన్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ మధ్యాహ్నం విద్యార్థులకు కిచిడీ వడ్డిస్తుండగా..అందులో చనిపోయిన పాము కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాము కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వడ్డింపు ఆపేశారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి హాని కలగలేదు.
విద్యార్థుల కోసం చేసిన కిచిడీలో పాము ఉన్నట్లు గుర్తించిన వెంటనే భోజనం వడ్డన నిలిపేశామని నాందేడ్ డీఈవో ప్రశాంత్ డిగ్రాస్కర్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని, విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 80 మంది విద్యార్థులు చదువుతున్నారు.