అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే మహిళలను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలోగానీ…ఏ రాష్ట్రంలోనూ మహిళలు లేని కేబినెట్ కేసీఆర్‌ది మాత్రమేనని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు కోట్ల మంది మహిళల్లో ఎవరూ మంత్రి అయ్యేందుకు అర్హులు కారని కేసీఆర్ బావిస్తున్నట్లు ఉన్నారని విమర్శించారు. తెలంగాణలో మహిళా సాధికారతకు కేసీఆర్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన…తెలంగాణ రాష్ట్ర సాధన సోనియాగాంధీ వల్లే సాధ్యమయ్యిందని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తెలంగాణ బిల్లు సభామోదం పొందడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిద్దరినీ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Cbn Di kuda at least kcr deputy speaker ayina echadu