కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేశామనుకున్నారు. జనవరిలో రెండో దశ ప్రారంభమవుతుందని.. అది మరింత ఘోరంగా ఉంటుందని చెప్పారు.
జనవరిలో ఎటువంటి కేసులు నమోదు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ కరోనా వైరస్ ఇప్పుడు మరోసారి విశ్వరూపం చూపిస్తోంది.
వైరస్‌ను పుట్టించిన చైనా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఇతర దేశాలు మాత్రం ఊపిరాడక చస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కరోనాను కట్టడి చేయడంలో విఫలమైంది.
ప్రపంచంలో అన్ని రంగాల్లో తనదైన శైలిలో దూసుకెళ్లే అమెరికా కరోనాను అడ్డుకోలేకపోయింది. అమెరికాలో కరోనా మరణాలు 5 లక్షలు దాటడం ఆందోళనను కలిగిస్తోంది.
ఆదివారం నాటికి (21-2-2021) అమెరికాలో కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 4.98 మందికి చేరుకుంది. తాజా మరణాలతో ఆ దేశంలో మరణాల సంఖ్య 5,11,130కి చేరిందని పలు అమెరికా మీడియా సంస్థలు చెబుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో మరణాలు భారీ సంఖ్యలో సంభవించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 102 ఏళ్ల క్రితం ఇన్‌ఫ్లూయెంజా మహ్మమారి విలయతాండవం తర్వాత అమెరికా ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోగ్య సంక్షోభం ఇదే అని అంటువ్యాధుల విభాగం నిపుణుడు డాక్టర్ అంటోనీ ఫౌచీ అన్నారు.
కరోనాను కట్టడి చేస్తామని జొ బైడెన్ చెప్పిన్పటికీ ఇంకా ఎటువంటి చర్యలకూ పునుకోలేదు. దీంతో మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మంచు తుఫానులు అమెరికా వాసులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.
తీవ్రమైన చలి కారణంగా వైరస్ వ్యాప్తి అతివేగంగా కొనసాగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్ దిగిపోయే నాటికి 4 లక్షలకు పైగా మరణాలు ఉండగా… తాజాగా వీటి సంఖ్య 5 లక్షల మార్క్ దాటింది.