భారత్‌కు అమెరికా ఎంత బాకీ ఉందో తెలుసా?

222

ప్ర‌పంచ దేశాల‌న్నీ అమెరికాను పెద్ద‌న్న అని పిలుస్తారు. ఎందుకంటే ప్ర‌పంచ బ్యాంక్‌లో అమెరికా భాగ‌స్వామ్యం ఎక్కువ‌.

మ‌న నాయ‌కులు చేసే అప్పుల వ‌ల్ల భార‌త్‌లోని ప్రతి వ్య‌క్తి త‌ల‌పై కొన్నివేల రూపాయ‌ల అప్పు ఉంద‌ని గ‌తంలో చెప్పేవారు. ఇప్పుడు ఆ అప్పు మ‌రింత పెరిగిండొచ్చు.

పేద, చిన్న దేశాల‌కు, అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు అమెరికా అప్పులు ఇస్తుంటుంది. కానీ ఆ దేశం కూడా అప్పులు చేస్తుంద‌న్న విష‌యం చాలా మందికి తెలీదు.

అభివృద్ది చెందిన దేశంగా ఉన్న అమెరికా ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగా పిలువ‌బ‌డుతున్న భారత్ దగ్గర కూడా అప్పులు చేసింది.

భార‌త్‌కు అమెరికా ఇప్పటి వరకు 216 బిలియన్ డాలర్ల బాకీ ఉంది.

ఈ విషయాన్ని రిపబ్లికన్​ పార్టీ చట్టసభ్యుడు అలెక్స్​ మూనీ వెల్లడించారు. 216 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 15 లక్షల కోట్లకు పైమాటే.

ఇప్పటి వరకు అమెరికా 27.9 ట్రిలియన్​ డాలర్లు బాకీ ఉందని పేర్కొన్నారు. కరోనా రిలీఫ్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని వ్యతిరేకిస్తూ మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

జపాన్​, చైనాలకు ఒక్కో ట్రిలియన్​ డాలర్ల చొప్పున బాకీ ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్నారు. సగటున ఒక్కో అమెరికన్​ 84 వేల డాలర్లకు పైగా బాకీ ఉన్నాడని చెప్పారు.

2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. 2050 నాటికి అమెరికా బాకీ 104 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని ఓ అంచ‌నా.