స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పర్యటనకు వెళ్లింది ఓ మహిళా కలెక్టర్. మార్గమధ్యలో టైరు పంక్చర్ కావడంతో ఎవరి సాయం కోరకుండా తానే టైరు మార్చేశారు.
కర్ణాటకలో మైసూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తెలుగమ్మాయి రోహిణి సింధూరి తన పనులు తానే చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తూ తన నిరాడంబరతను చాటుకుంటున్నారు.
తాజాగా రోహిణి సింధూరి తన వాహనం టైరును స్వయంగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఇటీవల ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి కొడగు ప్రాంతంలో పర్యటించారు. అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు స్వయంగా వాహనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.
మార్గమధ్యలో తన వాహనం టైరు పంక్చర్ అయింది. ఎవరి సాయం కోరకుండా తానే అందుబాటులో ఉన్న పనిముట్లతో చకచకా టైరు మార్చేశారు.
కారు టైరును జాకీ సాయంతో లేపి, దాన్ని తొలగించి, కొత్త టైరు బిగించారు. ఎంతో ప్రొఫెషనల్ గా ఈ పని చేసిన కలెక్టర్ ఏమాత్రం అలసట లేకుండా మళ్లీ కారు నడిపేందుకు సిద్ధమయ్యారు.