గోదావరిఖని: స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులో లెక్చరర్గా పనిచేస్తున్న మంతెన శ్రీనివాస్ తను బోధించే సబ్జెక్టులోని అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఆన్లైన్ వీడియోల రూపంలో రూపొందించడం జరిగింది.
మొత్తము సిలబస్ సరళమైన భాషలో 300 వీడియోలు గా విభజించి సామాన్య విద్యార్థి కూడా పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యేవిధంగా ఈ వీడియోలు రూపొందించారు. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు మొత్తం సిలబస్ ఆన్లైన్ వీడియోల రూపంలో 300 వీడియోలుగా రూపొందించి నందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ గుర్తించి అభినందిస్తూ తేదీ 30 .07.2020 రోజున హైదరాబాదులో ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ శ్రీ సయ్యద్ ఒమర్ జలీల్ గారు సన్మానము చేశారు.
అంతేకాకుండా ప్రతి లెక్చరరు మంతెన శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకుని తమ తమ సబ్జెక్టులలో వీడియో సీడీలను రూపొందించి ఈకరోనా సమయంలో విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా విద్యను నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు .ఈ కార్యక్రమంలో బోర్డు అధికారులు శ్రీ లక్ష్మా రెడ్డి , సర్వేశ్వర్, శ్రీ నండూరి శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు..
మంతెన శ్రీనివాస్ ఆన్లైన్ క్లాసులను ishwaryam వీడియో ఛానల్ ద్వారా చూడవచ్చు.