45 వ డివిజన్ లో వేగంగా కరోనా నివారణ పనులు

454
Corporator Kommu Venu

45 వ డివిజన్ పరిధిలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు వున్న లైన్ లలో సోడియం హైపోక్లోరిన్ ద్రావణాన్ని స్ప్రే చేయించడం జరిగినది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 45 వ డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు ఆధ్వర్యంలో ఈ ద్రావణం ఇంటింటా స్ప్రే చేయించారు.

ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని బయటికి వచ్చినపుడు మాస్కులు ధరించి రావాలని, సామాజిక దూరం పాటించాలని తెలియజేయడం జరిగినది. అలాగే కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పలు వంటి లక్షణాలు ఉంటే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ తెలిపిన సూచనలు పాటించాలని, ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు, మున్సిపల్ సిబ్బంది మరియు ఎర్రగోళ్ల శ్రీకాంత్,మీనుగు సురేష్ పాల్గొన్నారు.