తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జూలై 5, 6 తేదీల్లో అగ్నికల్చర్, ఫార్మా పరీక్షలు, 7,8,9వ తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణ ఉంటుంది.
ఎంసెట్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి 100 శాతం, సెకండియర్ నుంచి 70 శాతం సిలబస్ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.