
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలయ్యకు మరోసారి అభిమానుల అత్యుత్సాహం కోపం తెప్పించింది. ఓ యువకుడిపై ఆయన చేయి చేసుకున్నారు.
హిందూపురంలోని శ్రీకంఠపురం 9వ వార్డు అభ్యర్థితో బాలయ్య మాట్లాడుతుండగా ఓ యువకుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు.
అది గమనించిన బాలకృష్ణ ఎందుకు వీడియో తీస్తున్నావంటూ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ ఆ యువకుడు వినకుండా వీడియో తీస్తూ ఉండడంతో బాలకృష్ణ కోపోద్రిక్తుడై ఆ యువకుడి చెంపచెళ్లుమనిపించారు. దాంతో అక్కడున్న వాళ్లు స్పందించారు.
బాలయ్య స్టాప్ అన్నాడంటే ఆపేయాల్సిందే అని ఆ యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది.